మంగళవారం లాభాల్లో స్టాక్ మార్కెట్ లు


మంగళవారం దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం స్వల్పంగా వున్నప్పటికీ కొంత సేపు తరువాత బాగా పుంజుకొన్నాయి. ఐటీ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల వల్ల లాభాల్లో స్థిరపడ్డాయి. మంగళవారం 380 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌ కొద్దిసేపటికి భారీ నష్టాల్లోకి వెళ్ళింది.

అలాగే ఇంట్రాడేలో 45,162 వద్ద కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఆ తర్వాత క్రమంగా లాభాల బాట పట్టింది. కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. మంగళవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 453 పాయింట్లు పెరిగి 46,006 వద్ద స్థిరపడింది. ఇక 13,373 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఒకదశలో 13,244 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అలాగే చాలా సేపు స్థిరంగా వున్న స్టాక్ సూచీ చివరకు 138 పాయింట్లు లాభపడి 13,466 వద్ద ముగిసింది. దీంతో లాభాలను నమోదు చేయగలింది.