ఒక్క ప్రయాణికుడి కోసం కోలకతా నుంచి చెన్నై వరకు ప్రత్యేక విమానం



విదేశాలలో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాలలో ఇండియాకు తరలిస్తున్న విషయం తెలిసిందే అయితే సింగపూర్ నుంచి 145 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానంలో చెన్నై కు వచ్చే సరికి ఒక్కడే ప్రయాణికుడు దిగడంతో అధికారులు షాక్ అయ్యారు ..శుక్రవారం రాత్రి 10:30 గంటలకు కోల్‌కతా మీదుగా ఓ ప్రత్యేక విమానం చెన్నై చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు ఎయిరో బ్రిడ్జ్ విమానానికి అనుసంధానం చేశారు.

విమానాశ్రయ అధికారులు ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ విమానం నుంచి చెన్నైకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మాత్రమే దిగడంతో అధికారులు దిగ్ర్భాంతి చెందారు. ఆ వ్యక్తిని విచారించగా సింగపూర్‌ నుంచి 145 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారని, కొల్‌కతాలో 144 మంది ప్రయాణికులు దిగగా, తాను మాత్రమే చెన్నై వచ్చానని బదులిచ్చాడు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

కాగా చెన్నైలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు ..దేశంలోనే అత్యధిక కేసులు ఢిల్లీ , ముంబై ల తర్వాత తమిళనాడులోనే ఉంటున్నాయి ..రోజుకు వేలల్లో కేసులు నమోదు అయితున్నాయి ..దీనితో చెన్నైలో తిరిగి లాక్ డౌన్ విధించారు ..జూన్ 19 నుంచి 12 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు..