ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పేరు ముందు అలాంటివి వాడవద్దన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్


ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ దేశాన్నే విషాదంలోకి నెట్టేసింది. క్రమంగా బాలు కోలుకుంటున్నారని అతని కుమారుడు చరణ్ వివరాలు అందించడంతో అందరూ సంతోషపడ్డారు. ఆయన కరోనా వైరస్ బారి నుంచి బయటపడినప్పటికీ వయసు రీత్యా ఆయన అనారోగ్యం నుండి తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణంతో అభిమానులంతా విషాదంలో మునిగినిపోయారు.

ఈ సమయంలోనే బాలు తన స్వహస్తాలతో రాసిన లేఖ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ కొన్ని చిన్న చిన్న అభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ నా పేరు ముందు 'డాక్టర్‌', 'పద్మభూషణ్‌, 'గానగంధర్వ' వంటి విశేషణలు వేయకండి అని కోరారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక గొప్ప గాయకుడిని దేశం పోగొట్టుకున్నదని సినీ ప్రముఖులతో బాటు అభిమానులు కూడా చింతిస్తున్నారు.