సోమవారం నుంచి నైరుతి రుతు పవనాలు తిరోగమనం: భారత వాతావరణ విభాగం


ఆంధ్ర రాష్ట్రంలో ఈ సరి బాగా వర్షాలు పడ్డాయి. ఈ సరి నైరుతి రుతు పవనాలు సోమవారం నుంచి తిరోగమనం చెందనున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతు పవనాలు పూర్తిగా తిరోగమనం చెందే అవకాశమున్నట్టు తెలిపింది. ఈ వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు చెప్పింది.

వర్షాలు బాగా పాడడం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా శనివారంనాటికి సాధారణం కంటే 9 శాతం ఎక్కువ వర్షపాతం రికార్డయినట్టు వెల్లడించింది. ‘పశ్చిమ రాజస్థాన్‌, పరిసర ప్రాంతాల్లో సోమవారం నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందే అవకాశాలున్నాయి’ అని ఐఎండీ ఆదివారం పేర్కొంది. తొమ్మిది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా, 20 రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వివరించింది.