రైతుల ఉద్యమం ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది..శరద్ పవార్


రైతుల సహనాన్ని కేంద్రం పరీక్షించవద్దని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని హెచ్చరించారు. రైతుల డిమాండ్ల విషయంలో ఓ గడువు వెల్లడించకుండా ఉంటే.. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశాలున్నాయని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ వ్యవసాయ బిల్లులపై కూలంకశంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు సభలో కోరితే, సర్కారు హడావుడిగా ఆ బిల్లులకు ఆమోదం తెలుపుకున్నాయని మండిపడ్డారు. చర్చల విషయంలో రైతులు, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన ఏర్పడిందని, ఈ ప్రతిష్టంభన మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా గత కొద్దీ రోజులుగా ఢిల్లీలో రైతు సంఘాలు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే...ఇప్పటికే ప్రభుత్వం తో అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాలేదు ...ఇక నిరసనలో భాగంగా డిసెంబర్ 8న రైతులు భారత్ బంద్ ను విజయవంతంగా నిర్వహించారు ..