అదనపు రుణాల సమీకరణలో గడువును ఆరు నెలలు పొడిగించిన ఆర్బీఐ


మార్కెట్‌ రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం ద్వారా నిధులను సమీకరించునేందుకు రాష్ట్రాలకు ఇచ్చిన అదనపు వెసులుబాటును రిజర్వు బ్యాంకు మరింత పొడిగించింది. ఆర్బీఐ గడువును ఆరు నెలలు పొడిగించి౦ది.

కరోనా సంక్షోభంతో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమించడంలో రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు ఈ చర్య చేపట్టింది.

కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌లో ఆర్బీఐ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల సమీకరణలో అదనపు వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 30తో ముగియనున్న గడువును మరో ఆరు నెలలు పొడిగించినట్టు ఆర్బీఐ ప్రకటించింది.