కాలినడకన వెళ్లి రాష్ట్రపతిని కలవనున్న రాహుల్ గాంధీ


ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం అందజేయనుంది. ఇవాళ రాష్ట్రపతి భవన్‌కు రాహుల్ గాంధీ కాలినడకన వెళ్లనున్నారు.

రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్‌ నిర్వహించనున్నారు. ఓ మెమో రండంతో పాటు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రెండు లక్షల సంతకాలను రాష్ట్రపతికి సమర్పించనున్నారు...

నూతన చట్టాలను రద్దు చేయడం, ఈ విషయంలో రాష్ట్రపతి కోవింద్ జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణను చేపట్టింది. రైతు ఉద్యమానికి సంఘీభావంగా విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ మార్చ్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. పార్లమెంట్ భవనం దగ్గర లోని విజయచౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన వెళ్లి రాష్ట్రపతి కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయనున్నారు.