మంగల్ పాండే నివాసం ఎదుట నర్సింగ్ విద్యార్థుల నిరసన ప్రదర్శన


జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ విద్యార్థుల సంఘం బీహార్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి మంగల్ పాండే నివాసం ఎదుట నిరసన తెలిపింది. తమకు వెంటనే తుది ఏడాది పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలను ప్రకటించాలని విద్యార్థులు నినాదాలు చేశారు.

లేని పక్షంలో ఈ ఏడాది భర్తీ చేసే 4000 పోస్టులకు దరఖాస్తు చేయలేమని, తాము అర్హత కోల్పోతామని వాపోయారు. పలు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న కారణంగా తమకు కూడా పరీక్షలు నిర్వహించి, ఫలితాలను త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కరోనా నేపథ్యంలో భర్తీ చేసే ఖాళీల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పాట్నాలోని ఆరోగ్య మంత్రి మంగల్ పాండే నివాసం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించి నినాదాలు చేశారు.