ఇంగ్లాండ్ వెస్టిండీస్ ల
మధ్య జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం ఇంగ్లాడ్
జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ కెప్టెన్సీ తన ఆటతీరుపై ప్రభావం చూప
లేదని తెలిపారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ తొలి
టెస్టును కోల్పోయింది.
తొలి టెస్టు చివరి రోజున
వెస్టిండీస్ మొత్తం 200 పరుగులను ఛేదించింది, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో
ఆతిథ్య జట్టు పై 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
మ్యాచ్ అనంతరం పలువురు
మాట్లాడుతూ, స్టోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడికి గురయ్యాడని, కెప్టెన్సీనే
ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు.
దీనిపై స్టోక్స్ వివరణ
ఇచ్చారు. 'జోరూట్ ఇంటికే పరిమితం కావడంతో నేను కెప్టెన్సీని
ఎంజాయ్ చేశాను. కొంత కాలం క్రితం జట్టును నడిపించడం గురించి తెలుసుకున్నాను.
అందువల్ల నేను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.' అని తొలి టెస్టు ముగిసిన
అనంతరం స్టోక్స్ అన్నాడు.
జట్టును నడిపించడం, మైదానంలో
నిర్ణయాలు తీసుకోవడంలో నేను నిజంగా చాలా ఆనందించాను అని తెలిపాడు. కెప్టెన్సీ వల్ల
తన ఆటతీరులో ఎలాంటి మార్పురాబోదని ధీమా వ్యక్తంచేశాడు బెన్ స్టోక్స్.