కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ...కర్ఫ్యూ రద్దు....


కర్ణాటకలో ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కరోనా కారణంగా తను ప్రకటించిన రాత్రి కర్ఫ్యూ ను ఉపసంహరించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది. దీనిని ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా బిజెపి ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అందువల్ల ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రాత్రి కర్ఫ్యూ ఉత్తర్వును రద్దు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. అందుకే నైట్ కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే రాత్రి సమయంలో వాహనాల రాకపోకలను ఆపలేము. నైట్ కర్ఫ్యూ రద్దు చేయబడినందున ఎవరూ అనవసరంగా బయట తిరుగుకూడదు. ఎటువంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం అని సిఎం అన్నారు.