మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత ..



బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(85) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాండన్‌ మంగళవారం ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. లాల్జీ గుండెపోటుతో చనిపోయినట్లు లక్నోలోని మేదాంత ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లాల్జీ టాండన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

లాల్జీ కుమారుడు అశుతోష్‌ టాండన్‌ ప్రస్తుతం యూపీలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం లక్నోలోని గులాలా ఘాట్‌లో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. అంత్యక్రియలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హాజరయ్యారు. టాండన్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు సంతాపం ప్రకటించారు. బీజేపీ నేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీలకు సన్నిహితుడిగా, పరిపాలనాదక్షుడిగా ఆయనకు పేరుంది.

అయితే టాండన్ మృతికి దేశ వ్యాప్తంగా నాయకులూ సంతాపం తెలిపారు.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ , ఏపీ గవర్నర్ , తెలంగాణ గవర్నర్ వంటి ప్రముఖులు సంతాపం తెలిపారు ..టాండన్ సేవలను గుర్తుచేసుకున్నారు