సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు, కేంద్ర
మాజీ మంత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన
శుభాకాంక్షలు తెలిపారు. మరాఠా యోధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మహారాష్ట్ర
మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ఈ రోజుతో 80వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ శరద్ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయురారోగ్యాలు
ప్రసాదించాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
తమిళ సూపర్ స్టార్
రజనీకాంత్ నేటితో 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని ప్రధాని మోదీ పుట్టిన
రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ శుభాకాంక్షలు తెలియజేసి జీవితాంతం ఆరోగ్యంగా
ఉండాలంటూ ట్వీట్ చేశారు.