మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు ..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు..దీనితో గత కొంతకాలంగా తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా సూచించాడు..ప్రస్తుతం రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్‌లో రూపొందుతోంది.

వచ్చే ఏడాది జనవరీ11 నుంచి ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నట్లు ఇటీవల సమాచారం వచ్చింది. అయితే ఇంతలో రాంచరణ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఇటీవల రాంచరణ్ ఆచార్య సెట్‌లోకి వెల్లి అందరిని కలిసి వచ్చాడు. దాంతో రాంచరణ్‌కు కరోనా ఆచార్య సెట్‌ నుంచి వచ్చిందా లేదంటే ఏమయిఉంటుందని అందరూ ఆలోచిస్తున్నారు.

ఒకవేల ఆచార్య సెట్ నుంచి రాకపోతే రాంచరణ్ ఇటీవల వెల్లిన కారణంగా వారు కూడా పరిక్షలు చేయించుకోవాలి. మరి ఇకముందు కరోనా పాజిటివ్‌గా ఎందరికి తేలనుందో చూడాలి.అయితే వరుసగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం సినీ వర్గాలలో కలకలం రేపుతోంది...