ఆయనతో నటించడం మా అమ్మ కల ..రామ్ చరణ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చరణ్ టీజర్ మెగా అభిమానులను , ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాతో పాటు కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు . ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నాన్నతో కలిసి నేను నటించడం మా అమ్మ కల . 'ఆచార్య 'సినిమాతో ఆ కల నెరవేరబోతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నా.

నేను నటించిన 'బ్రుస్ లీ సినిమా లో నాన్న గెస్ట్ రోల్లో కనిపించరు. ఇక ఆయన నటించిన 150 సినిమాలో నేను నాన్నతో కలిసి స్టెప్పులు వేసా .. నాన్న వల్లే నాకింత స్టార్ డమ్ వచ్చింది. నాన్నతో కలిసి నటించే అవకాశం వచ్చినపుడు అంతకన్నా ఏం కావలి. అని రాంచరణ్ అన్నారు