కార్ల తయారీ వ్యయాలు పెరగడం వల్ల పెరగనున్న మారుతీ కార్ల ధరలు


దేశంలో కారు తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు బాగా పెరగడంతో మారుతీ తమ కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వినియోగ దారులు మరింత అధికంగా చెల్లించుకోవలసి వుంది. ఇందువల్ల కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకునే వారికి పెద్ద భారం తగలనుందని తెలుస్తుంది.

వినియోగదారులు కొత్త కార్లకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. రానున్న జనవరి 1 నుంచి ధరల పెంపు నిర్ణయం అమలులోకి రానున్నట్లు తెలిపింది. కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది. అందుకే తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. గత ఏడాది కాలంగా కార్ల తయారీ వ్యయాలు పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు తమ కార్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

కార్ల తయారు వ్యయాలు పెరగడం వల్ల కస్టమర్లు ఈ భారాన్ని మోయాల్సి వస్తోందని చెప్పింది. కొత్త ఏడాది నుంచి ధరల పెంపు ఉంటుంది అని మారుతీ సుజుకీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కి తెలియజేసింది. ధరల పెంపు నిర్ణయం మోడల్ ప్రాతిపదికన మారుతుందని మారుతీ సుజుకీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయని తెలిపింది. తయారీలో వాడే స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ వంటి ధరలు పైకి కదిలాయని తెలిపింది. వీటి ధరలు దాదాపు 77 శాతం పెరిగాయని చెప్పింది. దీంతో ధరలు పెంచుతున్నామని పేర్కొంది. మారుతీ నిర్ణయం కారణంగా ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసలే కరోనా వల్ల ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ విషయం మరింత భారం కానుంది.