MEIS స్కీమ్ అందిస్తున్న ప్రయోజనాలపై పరిమితి


ఎంఈఐఎస్ కింద ఇప్ప‌టి వ‌ర‌కు అందిస్తున్న ప్రయోజనాలపై పరిమితి విధించారు. కేంద్రం దీనికి సంబంధించి నిన్న ఒక నోటిఫికేష‌న్ జారీ చేసింది. డైరెక్టరేట్ జనరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఈ నోటిఫికేష‌న్ జారీ చేశారు. దీని ప్రకారం, ఎంఈఐఎస్ పథకం కింద 1.9.2020 నుంచి 31.12.2000 మధ్య కాలంలో చేసే ఎగుమ‌తుల‌పై ఐఈసీ హోల్డర్‌కు మంజూరు చేయగల మొత్తం రివార్డు ఒక్కో ఐఈసీకి రూ.2 కోట్లు మించ‌కుండా ప‌రిమితి విధించారు.

దీనితో పాటు 1.09.2020 తేదీ నుంచి సంవత్సరం కాలానికి ముందుగా ఎటువంటి ఎగుమతులు జ‌ర‌ప‌ని ఐఈసీ క‌లిగిన ఎగుమ‌తిదారులు లేదా సెప్టెంబర్ 1తేదీ తరువాత ఏదైనా కొత్త ఐఈసీలు పొందిన వారు ఎంఈఐఎస్ ప‌థ‌కం కింద క్ల‌యిములు సమర్పించడానికి అర్హులు కాద‌ని ఈ నోటిఫికేష‌న్‌లో స్ప‌ష్టం చేశారు. ఈ ఎంఈఐఎస్ పథకం 1.1.2021వ తేదీ నుంచి ఉపసంహరించబడుతుంది.

1.9.2020 నుంచి 31.12.2020 మ‌ధ్య‌ కాలానికి ఎంఈఐఎస్ కింది మొత్తం క్ల‌యిమ్‌లు కూడా ప్రభుత్వం నిర్ధేశించిన‌‌ మొత్తం కేటాయింపులు రూ.5,000 కోట్లకు మించకుండా చూసేందుకు గాను రానున్న రోజుల్లో ఈ సీలింగ్‌ను మ‌రింత‌గా త‌గ్గించే అవ‌కాశం ఉంది. తాజా స‌వ‌ర‌ణ‌తో ఎంఈఐఎస్ ఎగుమతిదారుల క్ల‌యిమ్‌లలో 98 శాతం ప్రభావితం కావ‌ని అంచనా. ప్రభావితం కాని ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల ధరల విషయంలో ఇప్పటికే ఎంఈఐఎస్ ను ప్ర‌తిబింబించిన‌‌ కారణంగా వారు కొత్త‌గా ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఉత్పత్తుల కవరేజ్ లేదా ఎంఈఐఎస్ రేట్ల లో మార్పులోను ఉండవు.