తిరుమల ఘాట్‌ రోడ్డులో భక్తులపై చిరుత దాడి


తిరుమలలో రెండో ఘాట్ రోడ్డులో వాహనదారులపై చిరుత దాడి చేసి కలకలంరేపింది. అలిపిరి 4వ కిలో మీటర్ మలుపు దగ్గర ఉన్నట్టుండి మీదకు దూకేసింది. వెంటనే వాహనదారులు చిరుత నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పెట్రోలింగ్ వాహనాన్ని అక్కడికి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిరుత దాడితో ఘాట్‌ రోడ్డులో కలకలంరేగింది.

లాక్‌డౌన్ సమయంలో ఆ తర్వాత కూడా అడవిలో నుంచి జంతువులు తిరుమల వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఎలుగుబంట్లు, చిరుతలు సంచరించాయి.

సీసీ ఫుటేజ్ ద్వారా గమనించిన టీటీడీ సిబ్బంది స్థానికుల్ని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జనాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఘాట్‌లో వాహనదారులపై దాడి చేయడం ఒక్కసారిగా కలకలంరేపింది.