Breaking News: తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు...!

భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణం ఎలా వుండబోతోందో ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. గత సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్ మహానగరంతోపాటు పలు తెలంగాణ జిల్లాల్లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ ఆసక్తికరమైన సమాచారాన్ని అందజేసింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా వాతావరణం ఎలా వుండబోతోంది తెలియజేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

ఈ మేరకు సీనియర్ సైంటిస్టు రాజారావు వెదర్ బులెటిన్ విడుదల చేశారు. వచ్చే అయిదు రోజుల్లో తొలి మూడు రోజులు అంటే అక్టోబర్ 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు.