కేరళ ప్రజలందరికి ఉచిత కరోనా వ్యాక్సిన్ ...సీఎం పినరయ్ విజయన్


దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉండగా మరోవైపు రాష్ట్రాలు కరోనా వాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి...ఇప్పటికే బీహార్ ఎన్నికల సమయంలో బీహార్ ప్రజలందరికి ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రకటించగా , తాజాగా కేరళ ప్రజలందరికీ ఉచితంగా వేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయ్‌ తెలిపారు.

టీకా కోసం ఎవరికీ చార్జీలు విధించమని, ఇది ప్రభుత్వ వైఖరి అని ఆయన స్పష్టం చేశాయి. ఇంతకు ముందు తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే టీకా ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. భారత్‌ బయోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఫైజర్‌ అభివృద్ధి చేసిన మూడు కరోనా టీకాలు డ్రగ్‌ రెగ్యులరేటర్‌ పరిశీనలో ఉన్నాయి. దేశంలో ఐదు వ్యాక్సిన్లు ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.

అయితే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్‌ పరిమాణం ఇంకా తెలియదని సీఎం తెలిపారు. కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతోందని, ఇది ఉపశమనం కలిగించే విషయం ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశలు ముగిసినప్పటికీ.. కేసుల పెరుగుదలకు దోహదం చేస్తుందో లేదో రాబోయే రోజుల్లో మాత్రమే తెలుస్తుందన్నారు.