రాజకీయాల్లో రజనీకాంత్ రాకను స్వాగతిస్తున్నానన్న కమలహాసన్


మక్కల్ నీధి మయ్యాం పేరుతో ఇప్పటికే కమల్ హాసన్ తన రాజకీయ పార్టీను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు

ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కమలహాసన్ వచ్చే సంవత్సరం తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేస్తాననే దానిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల డిసెంబర్ 31 తేదీన తన పార్టీ పేరును ప్రకటించి, వచ్చే జనవరి నుండి పార్టీని ప్రారంభం చేయడానికి కావలసిన సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కమలహాసన్ రజనీతో కలిసి ఇద్దరం సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. ఇద్దరం కలిసి నటించబోయే ఈ సినిమాని పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందించి ఈ ఎన్నికలకు ముందు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కమలహాసన్ తెలియజేశారు. ఇప్పటికే రజనీకాంత్ మరియు కమలహాసన్ వేరు వేరు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.