రజినీకాంత్ నో పాలిటిక్స్ ప్రకటనపై స్పందించిన కమల్ హాసన్


సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకో రెండు రోజుల్లో పార్టీ ప్రకటించి రాజకీయాల్లోకి ఖాయం అని అందరు భావిస్తున్న తరుణంలో అందరికి షాకిస్తూ సూపర్ స్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు...అనారోగ్య కారణాల వలన ఈ నెల 31 న పార్టీ ప్రకటించడంలేదు అని తన అభిమానులు అందరు తనను క్షమించాలని రజిని కోరారు..

అయితే రజనీకాంత్‌ చేసిన రాజకీయ ప్రకటనపై మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ స్పందించారు. రజనీకాంత్‌ ప్రకటనతో ఎంతో నిరాశ చెందినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్‌ ఆరోగ్యమే తనకు ముఖ్యమని, ఎన్నికల ప్రచారం తరువాత రజనీని కలుస్తానని కమల్‌ హాసన్‌ తెలిపారు.

కాగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి ముఖ్య కారణం అనారోగ్య సమస్యలు అనే తెలుస్తుంది..ఇటీవల రజినీకాంత్‌ అన్నాత్తే షూటింగ్‌ సమయంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైబీపీతో బాధపడిన ఆయన ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో రజనీ ప్రస్తుతం రాజకీయ పార్టీ స్థాపనపై వెనక్కి తగ్గారు