నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన


భారీ తుఫానుగా ఆవిర్భవించిన నివర్ తుఫాను వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. డిసెంబర్ 2వతేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ పర్యటన సాగుతుంది. తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో పవన్ ఈ సందర్భంగా ముఖాముఖి నిర్వహిస్తారు.

నివర్ తుఫాను వల్ల రైతులకు కలిగిన నష్టాలపై కృష్ణా జిల్లా ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డలో ఆయన పర్యటన జరగనుంది. గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు కొలకలూరుల్లో పవన్ పర్యటిస్తారు. ఈ తుఫాను వల్ల పంటలకు భారీగానే నష్టాలు వాటిల్లింది.

ఆ తరువాత డిసెంబర్ 3 వతేదీన తిరుపతి చేరుకుని చిత్తూరుజిల్లాలో పర్యటిస్తారు. డిసెంబర్ 4 వతేదీన శ్రీకాళహస్తిలో పవన్ పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను పవన్‌ పరామర్శిస్తారు. ఇటీవలి తుఫాన్‌ దెబ్బకు అపార పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను పవన్ స్వయంగా పరిశీలిస్తారు. నష్టం ఏర్పడిన ప్రాంతాల్లో పర్యటించి వారిని పరామర్శించనున్నారు.