మూడో సారి లాక్ డౌన్ ప్రకటించిన ఇజ్రాయిల్ ..ఈసారి మరింత కఠినం


ప్రపంచ వ్యాప్తంగా ఒకవైపు కరోనా మహమ్మారి విజృంబన కొనసాగుతుండగానే మరోవైపు కొత్త వైరస్ స్ట్రెయిన్ మొదలయింది..ఇప్పటికే బ్రిటన్లో తీవ్ర రూపం దాల్చిన వైరస్ తాజాగా ప్రపంచ దేశాలకు కూడా పాకింది.అయితే కరోనా కారణంగా ఇప్పటికే చాల నష్టపోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈ కొత్త వైరస్ విషయంలో ముందుగానే అప్రమత్తం అయ్యాయి...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ మరోసారి లాక్ డౌన్ విధించింది. ఈ ఆదివారం నుంచే ఇది అమలులోకి వస్తున్నది. ప్రజలు ఎవరూ కూడా నివాసం ఉంటున్న చోటు నుంచి 1000 మీటర్లు దాటి పోరాదని స్పష్టం చేసింది. అయితే స్కూల్స్ కు మాత్రం అనుమతులు ఇవ్వడం విశేషం. గతంలో రెండుసార్లు లాక్ డౌన్ విధించిన ఇజ్రాయిల్ ఇప్పుడు మూడోసారి లాక్ డౌన్ విధించింది.

అయితే, ఈసారి అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే ఫైజర్ టీకాను దేశంలోని ప్రజలకు అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 19 వ తేదీన ఈ టీకాను ఆ దేశ ప్రధాని నెతన్యాహు తీసుకున్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు నెలలో దేశంలో 22 లక్షల మందికి టీకా అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని తెలిపారు..