వాడిపోయిన పెదాలలో తిరిగి జీవం తీసుకొచ్చే చిట్కాలు


చాలామంది పెదాలు వాడిపోయినట్టుగా, నిర్జీవంగా పేలవంగా తయారవుతాయి. కొందరికి పెదాలు వాపునకు గురవుతాయి. ముఖ్యంగా చలి కాలంలో పెదాలని పగిలినట్లు అయి మంటగా కూడా ఉంటాయి ..మరి ఈ సమస్య పరిష్కారానికి ఈ చిన్న చిట్కాలు పాటించండి.

1. కొన్ని ఐస్‌ముక్కలను కాటన్‌ గుడ్డలో తీసుకోవాలి. వాటితో సున్నితంగా పెదాలపై మర్దన చేయాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయడం ద్వారా ఫలితం ఉంటుంది. ఐస్‌ముక్కలను నేరుగా పెదాలకు తాకించవద్దు.

2. తాజా కలబంద నుంచి టీస్పూన్‌ జెల్‌ తీసుకోవాలి. వీలయినన్ని సార్లు పెదాలకు పూస్తే వాపు తగ్గుతుంది.

3. తేనెను ఉపయోగించి ఈ సమస్యకు చెక్‌పెట్టొచ్చు . ఒక టీస్పూన్‌ తేనెలో కాటన్‌ బాల్‌ను ఉంచండి. చల్లని నీటితో మొహం కడిగి ఆ బాల్‌ను పెదాలపై మర్దన చేయండి.

4. ఒక స్పూన్‌ పసుపును, చల్లని నీటితో కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూసి పది నిమిషాల తర్వాత తీసేయాలి. రోజులో మూడుసార్లు చేస్తే వాచిన పెదాలు తగ్గిపోతాయి. దీంతో పాటు ఏదైన నొప్పి ఉన్నా నయం అవుతుంది.

5. చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి