నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై పెరుగుతున్న విమర్శలు


ఏపీ లో ప్రభుత్వానికి మరియు ఎన్నికల కమీషనర్ కి మధ్య చోటుచేసుకున్న వ్యతిరేక ధోరణివల్ల చాలా విమర్శలు వెలువడ్డాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారశైలిని పలువురు తప్పుబడుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారా అని చూస్తే ఆయన మాటలు అవుననే అంటున్నాయి. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో వివాదాస్పదమైన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విమర్శలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్న ఆయన అదే వైఖరి కొనసాగిస్తున్నారు. మార్చ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రభుత్వంతో సంప్రదించకుండానే వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్నించి ప్రారంభమైన ఘర్షణ ఇంకా ఆగలేదు. తాజాగా కరోనా సంక్రమణ సమయంలో సకెండ్ వేవ్ భయం నెలకొన్న నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈసారి కూడా ప్రభుత్వంతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారు.

మన రాష్ట్రంలో కరోనా నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే నిమ్మగడ్డ వెనక్కి తగ్గకపోవడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. ఎన్నికల కమీషనర్ స్వప్రయోజనాల కోసం పని చేయకూడదని ఇతర రాష్ట్రాలతో పోల్చాల్సిన అవసరం లేదని మాజీ ఆర్టీఐ కమీషనర్ విజయ్ బాబు తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ పునరాలోచించాలన్నారు. బీహార్ తరువాత కోవిడ్ కేసులు పెరగడం, హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్లు కోవిడ్ భయంతో ప్రజలు ఓటేసేందుకు రాకపోవడం గమనించాల్సిన అంశమని మాజీ ఆర్టీఐ కమీషనర్ విజయ్ బాబు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో ఏపీను పోల్చాల్సిన అవసరం ఎందుకన్నారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఒక పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నట్టు కన్పిస్తోందన్నారు. బాధ్యుడైన అధికారి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రజల ప్రాణాల్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరోనా బాగా ప్రబలుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలనడంపై పెను దుమారం లేపుతుంది.