వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవం


అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఏపీ శాసన మండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. రిటర్నింగ్‌ అధికారి నుంచి ఎమ్మెల్సీగా మాణిక్యవరప్రసాద్‌ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

ఇప్పటి వరకు శాసన మండలిలో 9గా ఉన్న వైసీపీ సభ్యుల సంఖ్య 10కి చేరింది. తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని మళ్లీ ఆయనతోనే భర్తీ చేయడం విశేషం.

నాలుగు రోజుల క్రితమే వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ స్థానానికి ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.