ప్రముఖ టీవీ నటుడు అనారోగ్యంతో కన్నుమూత...


ప్రముఖ టీవీ నటుడు అషీష్ రాయ్ (55) అనారోగ్యంతో మృతి చెందారు. లాక్ డౌన్ కాలం నుండి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న అషీష్ రాయ్ తన ఇంటి వద్ద మరణించాడని CINTAA సీనియర్ జాయింట్ సెక్రటరీ అమిత్ బెహ్ల్ ధృవీకరించాడు. ఆశిష్ తన ఇంట్లో కన్నుమూశారు. దాని గురించి తెలియజేయడానికి దర్శకుడు అరవింద్ బబ్బల్ నన్ను పిలిచాడు అని అమిత్ ఈ సందర్భంగా చెప్పారు. ఇక ఇదే విషయాన్ని సీనియర్ నటి టీనా ఘాయ్ కూడా ధృవీకరించింది. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఆషిష్ ఈ మధ్యకాలంలో రెండు సందర్భాలలో జుహు ఆసుపత్రిలో చేరాడు. అందులో భాగంగా అతను డయాలసిస్ చేయించుకున్నాడు. అయితే సరైన చికిత్స చేసుకుందామంటే ఆర్ధిక సమస్యలు. దీంతో కొంత కాలంగా ఆయన ఈ రోగంతో బాధపడుతున్నాడు.

ఈ ఆర్ధిక సమస్యల కారణంగా ఎక్కడైనా పని చేద్దామంటే లాక్ డౌన్ వాటిని అన్నింటిని మూసివేసింది. మేలో ఈ నటుడిని ఆరోగ్య సమస్యలతో ఐసియులో చేర్చారు. ఈ వార్తను ఆయన తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా తన శ్రేయోభిలాషులకు తెలుపుతూ వారి నుండి ఆర్థిక సహాయం కోరాడు. బిల్లులు చెల్లించడానికి అతని వద్ద డబ్బు లేదు. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. తన దగ్గర రూ .2 లక్షలు ఉండగా ఆసుపత్రిలో చేరిన మొదటి రెండు రోజులలో అది ఖర్చు అయ్యిందని తెలిపారు అషీష్. ఇలా దెబ్బ మీద దెబ్బ పడడంతో ఇటు ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఆర్ధిక సమస్యల కారణంగా ఆరోగ్యం క్షిణించడంతో ఈరోజు ఆయన మృత్యువాత పడ్డాడు. అషీష్ రాయ్ ప్రముఖ టెలివిజన్ షోలు బనేగి అప్ని బాత్, సాసురల్ సిమార్ కా, రీమిక్స్, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ మొదలగు సీరియల్స్‌లో నటించాడు.