కరోనా చికిత్స ఎక్కడైనా ఒకటే ..ఈటెల రాజేందర్


తెలంగాణ రాష్ట్రంలోని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించి ప్రాణాలను కాపాడాలని ఆశావర్కర్లకు సూచించారు.

గ్రామాల్లో కరోనా సోకిన వ్యక్తులను మొదటి రోజే గుర్తిస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు వారి ప్రాణాలను కాపాడగలమన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా కరోనా చికిత్స ఒకటేనని, అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులను ఖర్చు చేసుకోవద్దని సూచించారు. ఇలాంటి వ్యాధులను ప్రజల భాగస్వామ్యంతోనే ఎదుర్కోగలమని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారని గుర్తు చేసారు.

కొన్ని సీజనల్ వ్యాధులు, కరోనా లక్షణాలు ఒకటే ఉన్నందున సాధ్యమైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలనన్నారు. ర్యాపిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా..వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు