దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు


ఉత్తరభారతదేశంలో వరుస భూకంపాలు వస్తూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.

నంగలోయి ప్రాంతంలో ఇవాళ ఉదయం 5.02 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 2.3గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. నంగలోయితోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.

ఈ భూప్రకంపన లతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అసోంలోని నౌగామ్‌లో నిన్న ఉదయం భూ కంపం వచ్చింది. ఉదయం 6.56 గంటల ప్రాంతంలో 3.0 తీవ్రతతో భూమి కంపించింది.