ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు తోచిన సాయం చేయాలి ..ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన అరవింద్ కేజ్రీవాల్


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు రైతులు... ఈ ఆందోళనల్లో వేల సంఖ్యలో రైతులు పాల్గొంటున్నారు..

వందలాది ట్రాక్టర్లతో రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్న అన్నదాతలు.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఆందోళనల్లో పాల్గొంటున్న రైతాంగానికి తోచిన సాయం చేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..

మరోవైపు.. రైతుల డిమాండ్లపై స్పందించి.. సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని కోరారు. చలికి సైతం వెనకడుగు వేయకుండా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు.. ఆప్ ఎమ్మెల్యేలు, వాలంటీర్లు సాయం చేస్తున్నారని.. ప్రజలు కూడా తమకు తోచిన సాయం చేయాలని కోరారు ఢిల్లీ సీఎం.

అయితే తమ డిమాండ్లను నెరవేరేచే దాక నిరసనను ఆపేది లేదని రైతులు తెలిపారు ...ప్రధాని మోడీ మాత్రం అగ్రి బిల్లులు రైతుల ఉపయోగం కోసం తెచ్చినవి అని అంటున్నారు...