ఆలస్యం కానున్న సచివాలయ భవనాల కూల్చివేత


సచివాలయం కూల్చివేత పనులు జులై 15 వరకు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సచివాలయం భవనాల కూల్చివేతను నిలిపేయాలని పి.ఎల్. విశ్వేశ్వరరావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.నేటి వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి విచారణ సందర్భంగా సచివాలయ భవనాల కూల్చివేత పనులపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.

కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి ఏజీ స్పందిస్తూ ఈ రోజు సాయంత్రమే సమర్పిస్తామన్నారు. దీంతో బుధవారం వరకు సచివాలయ కూల్చివేతపై హై కోర్టు స్టే విధించింది.

తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో సచివాలయ భవనాల కూల్చివేత మరింత ఆలస్యం కానుంది.

ఇప్పటికే భవనాల కూల్చివేత సగం పూర్తయ్యింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇదే విషయమై సుప్రీం కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.