కువైట్ రాజు కన్నుమూత


కువైట్‌ రాజు షేక్‌ సబ అల్‌ అహ్మద్-(91) కన్నుమూశారు. ఈ విషయాన్ని అమిరీ దివాన్‌ డిప్యూటీ మినిస్టర్‌ షేక్‌ అలీ అల్‌ జర్రా అల్‌ సబ తెలియ చేసారు. వైద్య పరీక్షల నిమిత్తం జులై 18న అమిర్‌ ఆస్పత్రిలో చేరగా అనంతరం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందన్నారు.

జూలై 23న అమెరికా వెళ్లి వైద్య చికిత్స తీసుకున్నారు. యన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచే వారసుడిగా షేక్‌ నవాఫ్‌ అహ్మద్‌ అ ల్‌ సబ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు.షేక్‌ సబ అల్‌ అహ్మద్‌ జనవరి 29, 2006లో అమిర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అంతకముందు ఆయన సోదరుడు, కువైట్‌కు రాజుగా ఉన్న షేక్‌ జబర్‌ అల్‌ అహ్మద్‌ అల్ సబ ఈయన్ను 2003లో ప్రధానమంత్రిగా నియమించారు. దీంతో అల్‌ సబా రాజవంశం నుంచి షేక్‌ సబ అల్‌ అహ్మద్‌ 15వ పారిపాలకుడిగా ఉన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు 40ఏండ్ల అనుభవం ఉన్నది. ఈ సమయంలోనే కువైట్‌ విదేశాంగ విధానం రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. అరబ్‌ ప్రపంచంలో ప్రముఖ దౌత్యవేత్తల్లో ఒకరిగా, గొప్ప మానవతావాదిగా ప్రశంసలు అందుకున్నారు.