ఇంటెలిజెన్స్ మాజీ అడిషనల్ డిజి ఏబి వెంకటేశ్వరవు పై చర్యలకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్...!

1969 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 8 ప్రకారం ఇంటెలిజెన్స్ మాజీ అడిషనల్ డిజి ఏబి వెంకటేశ్వరవు పై క్రమశిక్షణ చర్యలు సిద్ధమవుతుంది సీఎస్.

అయితే గతంలోనే సస్పెండ్ అయిన ఏబి వెంకటేశ్వరరావు పై చర్యలకు ఉత్తర్వులు జారీ చేసింది సీఎస్. 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది. ఏబి వెంకటేశ్వరవు పై విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం.

నిర్ణీత గడువులోగా లిఖిత పూర్వకంగా లేదా వ్యక్తిగతంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

విచారణ సందర్భంగా ప్రలోభపెట్టినా, ఎవరైనా ఏబి వెంకటేశ్వరరావు తరపున ప్రభావితం చెయ్యాలని చూసినా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.

గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో అంతర్గత భద్రతకు ముప్పు, పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డట్టు ఏబి వెంకటేశ్వరవు పై అభియోగాలు వచ్చాయి.

వెంకటేశ్వరరావు తో పాటు ఆయన కుమారుడు చైతన్య కృష్ణ పైన ఆరోపణలు వచ్చాయి. మొత్తం అభియోగాలు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలన్నింటిని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది ప్రభుత్వం.