జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం... ఫిబ్రవరిలో పంపిణీ...


రానున్న జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం కానున్నట్లు మరియు ఫిబ్రవరిలో దీనిని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అందరిని కలవర పెడుతున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది జనవరి చివరలో సిద్ధమవుతున్న తరుణంలో ఫిబ్రవరిలో పంపిణీకి రంగం సిద్ధం చేశారు. టీకా మొదటి మోతాదును వృద్ధులు, అధిక రిస్కు కలిగివున్నవారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కొవిడ్‌ వారియర్లుగా సేవలందించిన వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు.

వాక్సిన్ అందుబాటులో వచ్చే తేదీ ఇంకా కచ్చితంగా తెలియనప్పటికీ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ యొక్క మానవ పరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. వ్యాక్సిన్ భద్రత, ఖర్చు, ఈక్విటీ, కోల్డ్-చైన్ అవసరాలు, ఉత్పత్తి సమయపాలన మొదలైనవి కూడా తీవ్రంగా చర్చిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ప్రతిరోజూ 90,000 కన్నా ఎక్కువ పెరుగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా 50 లక్షల సంఖ్యకు భారత్ వేగంగా సమీపిస్తున్నది అని తెలిపారు.