విమాన ప్రయాణం చేసే
ప్రయాణికులకు విమానాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రయాణికుల అరచేతిలో
అందుబాటులో ఉండేలా ఓ మొబైల్ యాప్ను తయారుచేశారు ఐఐటీ గౌహతి విద్యార్థులు.
విమానాల వేళల నుంచి విమానాశ్రయంలో లభించే ఆహారం వరకు సకల సమాచారం ఈ యాప్లో
లభిస్తుంది. అంతేకాదు 'ఫ్లైజీ' అని పేరుపెట్టిన ఈ యాప్ ద్వారా అనేక దేశాల
కరెన్సీల్లో పేమెంట్లు కూడా చేసే వీలున్నది. విమానం గంట లేటుగా బయల్దేరే పరిస్థితి
ఉంటే ఆ గంటలో మీరు అక్కడ ఆర్డర్ ఇచ్చి తినగలిగే ఆహారం ఏమిటి? అనేది కూడా ఈ యాప్ తెలుపుతుంది. దీంతో షాపింగ్ కూడా
ఎంచక్కా చేసేయొచ్చు. దీని ద్వారా విమాన ప్రయాణం ప్రజలకు మరింత చెరువవుతుంది.
ఈ యాప్ ఇంటర్నేషనల్ ఎయిర్
ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తోపాటు డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు
మరియు కరోనా సంక్షోభం తర్వాత కూడా విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని
రూపొదించిన బీటెక్ విద్యార్థులు దీపక్మీనా, హంన్స్రాజ్
పటేల్, అర్జిత్సింగ్ తెలిపారు. ముఖ్యంగా కొత్తగా విమాన
ప్రయాణం చేసేవారికి ఈ యాప్ మార్గదర్శిగా ఉంటుందని చెప్తున్నారు.