ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ..


కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే ప్రోటీన్ ఆహరం తీసుకోవాలి. ప్రోటీన్ ఆహరం అనగానే చికెన్ గుర్తుకు వస్తుంది. కరోనా కాలంలో చికెన్ తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. చికెన్ తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో చికెన్ కు భారీ డిమాండ్ పెరిగింది.

కొన్ని రోజుల క్రితం మటన్ కు డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం కొండెక్కాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ధరలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు చికెన్ ధరలు కూడా అమాంతం కొండెక్కాయి. మొన్నటి వరకు కిలో చికెన్ ధర రూ.180వరకు ఉండగా ఇప్పుడు ఆ ధర రూ.240కి చేరింది. దీంతో వినియోగదారులు చికెన్ కొనాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

అటు కూరగాయల ధరలు సైతం అమాంతంగా పెరిగిపోయాయి. సమృద్ధిగా వర్షాలు కురిసి పంట చేతికి వచ్చినా ధరలు పెరగడంతో వినియోగదారులుఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిమాండ్ కు తగిన విధంగా మార్కెట్లో కోళ్ళు దొరకడం లేదని, అందుకే ధరలు పెరిగినట్టు వ్యాపారాలు చెప్తున్నారు.