జీమెయిల్ లో మార్పు


ఈమెయిల్ కొరకే ఎక్కువగా ఉపయోగించే జీమెయిల్‌ ఫీచర్స్‌ మార్చబోతున్నారు. జీమెయిల్ ఇక ముందులా ఉండదు. మీరు చదువుతోంది నిజమే. జీ మెయిల్ స్వరూపం త్వరలోనే మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న జీమెయిల్ ఫీచర్స్‌కి ( Gmail features ) తోడు కొత్తగా ఇంకెన్నో మోడ్రన్ ఫీచర్స్‌ని జత చేస్తూ గూగుల్ సంస్థ జీ మెయిల్‌ని రీడిజైన్ చేస్తోంది.

గూగుల్ ప్రకటించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఈమెయిల్ కోసమే అధికంగా వినియోగిస్తున్న జీమెయిల్‌ను ఇకపై వర్క్‌ప్లేస్‌కి అనుగుణంగా వినియోగించుకునేలా సరికొత్త రూపు సంతరించుకోనుంది.

గూగుల్ సిద్ధం చేసిన రీడిజైన్ ప్రకారం కొత్త జీమెయిల్‌లో స్క్రీన్ కింది భాగంలో మెయిల్, చాట్, మీట్ ఫర్ వీడియో కాలింగ్, రూమ్స్ ఆప్షన్స్ ( Mail, Chat, Meet for video calling and Rooms ) ఉండనున్నట్టు సీనెట్ ప్రకటించింది.