జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం - APUWJ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్

కరోనా తో మృతి చెందిన జర్నలిస్టులకు యాభై లక్షలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని రాష్ట్ర కార్య ఎపియుడబ్య్లుజె రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ అన్నారు .గురువారం ఆలిండియా జర్నలిస్ట్ యూనియన్ (IJU) పిలుపు మేరకు నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద జిల్లా కలెక్టర్ చక్రధరబాబుకు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు .

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వినతి పత్రాలను అందజేస్తున్నామన్నారు .జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు .వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వాలు అనేక సహాయ సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు అందజేస్తున్నాయని జర్నలిస్టులకు మాత్రం ఎలాంటి సహాయ సహకారాలు అందజేయకపోవడం విచారకరం అన్నారు .

కరోనా వలన వంద జర్నలిస్టులు మృతి చెందిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సహాయం ప్రకటించకపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు .పంజాబ్, హర్యానా,ఒరిస్సా ,ఉత్తరాఖండ్ లాంటి చిన్న రాష్ట్రాలలో చనిపోయిన జర్నలిస్టులకు నాలుగు లక్షల నుండి పదిహేను లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు .

అక్రిడేషన్ల కోసం విడుదల చేసిన జీవోలో లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు .జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉన్న నియమాలను జీవోలో తక్షణం రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు .పాత్రికేయులకు యూనియన్లకు ఉన్న హక్కులను కాలరాస్తే ఊరుకోమని ఆయన అన్నారు .

ఈ కార్యక్రమంలో ఐజేయు సభ్యుడు రమేష్ బాబు, సామ్నా జిల్లా ప్రధాన కార్యదర్శి జి హనోకు,సీనియర్ జర్నలిస్ట్ దయాశంకర్, అక్మల్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.