Breaking News: బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో విషాదం...!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనిల్ దేవగణ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోదరుడు, నటుడు అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రాత్రి నా సోదరుడు అనిల్ దేవగణ్ తుదిశ్వాస విడిచారు.

ఆయన అకాల మరణం మా కుటుంబాన్ని ఎంతో దహించివేస్తోంది. వ్యక్తిగతంగా నేను ఆయనని ఎంతగానో మిస్ అవుతున్నా. ఆయన ఆత్మ శాంతి కోసం ప్రార్థించండి. కరోనా మహమ్మారి కారణంగా వ్యక్తిగత ప్రార్థన సమావేశం ఉండదు అని అజయ్ దేవగణ్ ట్వీట్ చేసారు.

యాక్షన్ చిత్రం 'రాజు చాచా' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన అనిల్ దేవగణ్ కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన 'ప్యార్ తో హోనా హి థా'(1998), 'హిందుస్థాన్కి కసం' (1999) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా అనిల్ తన సినీప్రయాణాన్ని ప్రారంభించారు.