బీజేపీ సీనియర్‌ నాయకురాలు, గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూత


బీజేపీ సీనియర్‌ నాయకురాలు, గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా కన్నుమూసారు. గోవా మాజీ గవర్నర్‌, ప్రముఖ హిందీ రయిత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు మృదులా సిన్హా (77) బుధవారం కన్నుమూశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లా ఛప్రా గ్రామంలో 1942 నవంబర్‌ 27న ఆమె జన్మించారు. తొలినాళ్లలో జనసంఘ్‌ పార్టీలో కొనసాగిన ఆమె అనంతరం బీజేపీలో చేరారు.

ఆమె 2014 ఆగష్టు నుంచి 2019 నవంబర్‌ వరకు గోవా గవర్నర్‌గా సేవలిందించారు. కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్‌గా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, ముజఫర్‌ పూర్‌ భారతీయ శిశుమందిర్‌ ప్రిన్సిపాల్‌గానూ పని చేశారు. మృదులా సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు సంతాపం ప్రకటించారు.

పేద ప్రజలకు మృదులా సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయం. రచయితగా సాహిత్య, సంస్కృతిక ప్రపంచానికి తనవంతు సేవలందించారు. ఆమె మరణం నన్నెంతో కలచివేసింది. ఆమె కుటుంబానికి నా సంతాపం. ఓం శాంతి అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మృదులా సిన్హా దేశానికి, బీజేపీ కోసం జీవితాంతం కృషి చేశారని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈమె మరణంపై సంతాపం వెలిబుచ్చారు.