అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం....


గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రచార కార్యక్రమం సందర్భంగా కొంత మంది ముస్లీం మహిళలు ఆయన్ను నిలదీశారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో వచ్చిన వరదల తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయంగా రూ.10 వేల ఇస్తాను అని ప్రకటించింది లక్షలాది మందికి అందించిన విషయం తెలిసిందే. అయితే తమకు వరద సహాయం అందలేదు అని పలువురు మహిళలు ఓవీసీని నిలదీశారు.

కష్టాల్లో ఉన్న సమయంలో తమను పట్టించుకోలేదు అని కానీ ఓట్లు అడిగే సమయంలో గుర్తుకు వచ్చాం అని నిలదీశారు. ఓవైసీ ప్రజల విమర్శలు విన్న తరువాత వారితో మాట్లాడడానికి ప్రయత్నించారు కానీ పరిస్థితి సరిగ్గా లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. జాంబాగ్ డివిజన్ లో ఎంఐఎం తరపు క్యాండిడేట్ కోసం అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించడానికి అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మొత్తం 52 స్థానాల్లో పోటీ చేస్తోంది.