ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవాలంటే ద్రావిడ్ ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే ... వెంగ్‌సర్కార్‌


ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి డేనైట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇండియ‌న్ బ్యాటింగ్ లైన‌ప్ పేక‌మేడ‌లా కుప్ప‌కూల‌డంపై ఎన్నో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ టీమ్‌ను కాపాడే స‌త్తా ఒక్క రాహుల్ ద్ర‌విడ్‌కు మాత్ర‌మే ఉంద‌ని అంటున్నాడు మాజీ ప్లేయ‌ర్ దిలీప్ వెంగ్‌సర్కార్‌.

అత‌న్ని వెంట‌నే ఆస్ట్రేలియా పంపించాల‌ని కూడా బీసీసీఐకి సూచిస్తున్నాడు. విదేశాల్లో త‌ర‌చూ త‌డ‌బ‌డుతున్న ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్‌కు ద్ర‌విడ్ స‌రైన మార్గ‌నిర్దేశ‌నం చేస్తాడ‌ని వెంగ్‌స‌ర్కార్ అభిప్రాయ‌ప‌డ్డాడు. టీమ్‌కు సాయం చేయ‌డానికి వెంట‌నే ద్ర‌విడ్‌ను ఆస్ట్రేలియా పంపించాలి.

బంతి ఈ స్థాయిలో స్వింగ్ అవుతున్న ప‌రిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ను గైడ్ చేయ‌డానికి ద్ర‌విడ్‌ను మించిన ప్లేయ‌ర్ మ‌రొక‌రు లేరు. అత‌ను అక్క‌డ ఉంటే.. నెట్స్‌లో ఇండియ‌న్ టీమ్‌కు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాడు. ఎలాగూ కొవిడ్ వ‌ల్ల 9 నెల‌లుగా నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ మూత ప‌డే ఉంది కాబ‌ట్టి.. బీసీసీఐ వెంట‌నే అత‌న్ని ఆస్ట్రేలియా పంపించాలి అని వెంగ్‌స‌ర్కార్ సూచించాడు.