జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ బిర్యానీ సెంటర్ పెట్టుకోవాల్సిందే ....బండి సంజయ్


గ్రేటర్‌ ఎన్నికలు జనతా గ్యారేజ్‌కి, కల్వకుంట్ల గ్యారేజ్‌కి మధ్య జరుగు తున్నవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలతో ఉండే బీజేపీకి ఓట్లు వేస్తారో లేక కల్వకుంట్ల కుటుంబం కోసం ఓట్లు వేస్తారో ఓటర్లు ఆలో చించాలన్నారు.

ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్లతో కలసి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

గ్రేటర్‌ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ పతనం ఖాయమని, సెక్రటేరియట్‌ను కూలగొట్టిన ఆ పార్టీ... బిర్యానీ సెంటర్‌ పెట్టుకోవాల్సిందేనన్నారు. ఫలితాల తర్వాత అమిత్‌ షా వచ్చి బిర్యానీ తిని వెళ్తారన్నారు..రాష్ట్రంలో అవినీతి, కుటుంబ రాజకీయాలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిందని, అయినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు