మమత బెనర్జీ కి కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసి


ఎంఐఎం పార్టీ వచ్చే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది...ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అయిదు స్థానాలలో విజయం సాధించింది...దీనితో ఏంఐఏం పార్టీ పై మమతా బెనర్జీ పరోక్షంగా విమర్శలు గుప్పించింది..

కోట్లాది రూపాయలతో హైదరాబాద్ నుంచి ఓ పార్టీ తీసుకొచ్చి ముస్లిం ఓటర్లలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా తమ పార్టీపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.

‘డబ్బుతో అసదుద్దీన్ ఒవైసీని కొనే మగాడు ఇంకా పుట్టలేదు’ అంటూ దీదీకి కౌంటర్ ఇచ్చారు. ముస్లిం ఓటర్లు మమతా జాగీర్ లేదా సొంతం కాదని వాగ్బాణాలు సంధించారు.అసదుద్దీన్ ఒవైసీని డబ్బుతో కొనగలే వ్యక్తి ఇంకా పుట్టలేదు.. ఆమె ఆరోపణలు నిరాధారమైనవి.. ఆమె బాగా అలసిపోయారు.. తృణమూల్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీలోకి వెళుతున్నారు.. కాబట్టి తన పార్టీ గురించి ఆమె ఆందోళన చెందాలి.. మాకు ఓటువేసిన బీహార్ ఓటర్లు, ప్రజలను మమత అవమానించారు’ అంటూ ఒవైసీ మండిపడ్డారు.