Breaking News: రైతులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్...!

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలకు సైతం ఉచిత పంటల బీమాను అమలు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ. 101 కోట్లను విడుదల చేసి ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే గతేడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు కూడా బీమాను అమలు చేసింది. కాగా, ఈ-పంటలో నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే ఈ ఉచిత బీమా వర్తించనుంది. మరోవైపు రాష్ట్రంలో జిల్లాల వారీగా ఏయే పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలన్న వివరాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది.

అటు జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే(జీసీఈఎస్) ఆధ్వర్యంలో బీమా క్లెయిమ్స్ సమస్యలను పరిష్కరించనున్నారు. కాగా, వాతావరణ ఆధారిత పంటల బీమా పధకానికి సంబంధించిన క్లెయిమ్స్‌ను ఏపీఎస్‌డీపీఎస్/ ఐఎండీ/ రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్‌ గేజ్‌ స్టేషన్లు ఇచ్చే సమాచారం బట్టి పరిష్కరిస్తారు.