ఉన్న జనాభా 500 , వచ్చిన కరోనా కేసులు 100


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. నలుగురు కలిసి ఒక చోట భోజనం చేయాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో గ్రామంలోని ప్రజలందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తే ఇంకేమైనా ఉన్నదా? అందులో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది.

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీఆర్కే పురం గ్రామంలో ఏకంగా వందమందికి కరోనా సోకింది. అంతమందికి కరోనా ఎలా సోకింది అనే విషయంపై అధికారులు ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది. ఇటీవలే ఆ గ్రామంలో దినకర్మ జరిగింది. ఆ సందర్భంగా గ్రామంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ భోజనాలకు గ్రామంలోని ప్రజలు హాజరయ్యారు. సహపంక్తి భోజనాల తరువాత వరసగా కరోనా కేసులు నమోదుకావడం మొదలుపెట్టాయి. 500 మంది ఉన్న ఆ గ్రామంలో వందమందికి కరోనా సోకినట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో వీఆర్కేపురం గ్రామం ఒక్కసారిగా వైరల్ అయ్యింది.