వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబయిన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం


ముక్కోటి ఏకాదశి వేడుకలకు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు కొనసాగనున్నాయి. రేపు రాత్రి 2 గంటల 30 నిమిషాలకు లక్ష్మీసమేత యోగా ఉగ్ర నరసింహస్వామి మూలవిరాట్లకు మహాక్లీరాభిషేకం చేయనున్నారు.

ఉదయం నాలుగు గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్పవేదికపై స్వామివార్లకు నివేదన, వేదగోష నిర్వహిస్తారు. 5 గంటలకు శ్రీమఠం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, విశ్వయోగి మహారాజ్‌తో ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్నారు. ఉత్సవంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌ నేతతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కరోనా దృష్ట్యా ఆలయ అధికారులు పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు రద్దు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.