కార్పొరేట్లకే మాత్రమే ఉపయోగపడే వ్యవసాయ చట్టాలు...


కేంద్ర౦ కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయని ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు పేర్కొన్నారు. మంగళవారం భారత్‌ బంద్‌లో భాగంగా షాద్‌నగర్‌ బూర్గులగేట్‌ వద్ద రైతులకు మద్దతుగా మంత్రి కేటీఆర్‌తోపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు.

కేశవరావు మాట్లాడుతూ..కేంద్రం ఈ చట్టాలను పార్లమెంటులో అప్రజాస్వామికంగా అమలు చేసుకుందని ఆక్షేపించారు. టీఆర్‌ఎస్ నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నదని అన్నారు. వ్యవసాయం కార్పొరేటీకరణ కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

విపక్షాలు సూచించిన సవరణలను పట్టించుకోలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు రైతులు ఒక్కటి అవుతున్నారని అన్నారు.