శబరిమలలో కరోనా కలకలం...39 మందికి కరోనా పాజిటివ్


దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. అటు కేరళలోనూ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో 39మంది ఆలయసిబ్బంది, భక్తులకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల దర్శనానికి భక్తులు చేరుకుంటున్నారు. దీంతో కొద్దిమంది సిబ్బంది అస్వస్థతకు గురి కాగా కరోనా పరీక్ష చేయించింది దేవస్థాన బోర్డు.

దీంతో 27మంది ఆలయ సిబ్బంది సహా 39 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వారు తెలిపారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా పరీక్షలు చేయించామని బోర్డు అధికారులు వెల్లడించారు. సన్నిధానం, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పాయింట్లలో మొత్తం 39 కేసులు నమోదైనట్లు తెలిపారు.