24 గంటలలో కరోనాతో 3054 మంది మృతి...


అమెరికాలో కరోనా కారణంగా డిసెంబర్ 9 ఒక్క రోజే రికార్డు స్థాయిలో 3,054 మరణాలు సంభవించాయి. మంగళవారం 2,769 మంది మరణించారు. అమెరికాలో ఇప్పటివరకు 1.5 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. మొత్తం 2,86,249 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది ఆందోళన కలిగిస్తోంది. అనుమతులు వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ అవసరం ఉన్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు.

కొత్తగా రెండు లక్షలా పది వేల మందికి వైరస్ సోకింది. బుధవారం మొత్తం 18 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు యూఎస్ కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్టు తెలిపింది. అమెరికాలో అతి త్వరలో రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతి లభించి అందుబాటులోకి వస్తాయనే అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు తుది ఆమోదం కోసం FDAకు దరఖాస్తు చేశాయి. అటు టీకా పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సన్నాహకాలు ప్రారంభించింది.